ఆ చెట్టును నరికితే ఏమవుతుందో తెలుసా…

132

భూమిపై అత్యంత తెలివైన జంతువు ఏదైనా ఉంది అంటే అది మనిషి అని అందరూ పేర్కొంటున్నారు. ఈ మనిషికి తెలియని ఎన్నో వింతలు విశేషాలు ఇంకా కూడా ప్రకృతిలో చాలా దాగి ఉన్నాయి. ఈ ప్రకృతిలో విచిత్రాలు అనేది ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది ఉన్నాయి. మనుషులకు తెలియని రహస్యాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కొత్త కొత్త సంఘటనలు వచ్చి మనుషులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. వ్యోమన్ లోని సర్కోత్రా సమీపంలో ఉండే డ్రాగెన్ చెట్టు గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. డ్రాగన్ బ్లడ్ ట్రీ అంటే డ్రాగన్ లాంటి రక్త వర్ణము ఈ చెట్టు నుంచి కారుతుంది. ఈ చెట్టు ని గాయపరిస్తే దీని నుంచి వచ్చే జిగురు ఎర్రటి రంగులో ఉంటుంది. అందుకే దీనిని డ్రాగన్ బ్లడ్ ట్రీ అని పిలుస్తారు. ఈ చెట్లు తిరగబడిన గొడుగు ఆకారంలో ఉంటాయి. ఇవి ఆరువందల యాభై సంవత్సరాల వరకు జీవించగలవు.

ఇవి 33 నుంచి 39 అడుగుల వరకు పెరుగుతాయి. వేడి తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఇవి పెరుగుతాయి కాబట్టి చాకో త్ర ద్వీపంలో ఇవి పెరుగుతున్నాయి. ఈ చెట్టు పై భాగంలో ఆకులు కొమ్మలు దట్టంగా ఉంటాయి. బాగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చెట్టు బెరడు నరికితే అచ్చం రక్తంలో ఉండే ద్రవం బయటికి వస్తుంది. అలా వచ్చి  ద్రవాన్ని డ్రాగింగ్ జంతువు యొక్క రక్తం అని స్థానికులు భావిస్తూ ఉంటారు. అందుకే ఈ మొక్కకు ఆ పేరు వచ్చింది. ఆ ద్రవాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు ఈ ద్రవం జ్వరం అల్సర్ నొప్పులను తగ్గిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యంలో ఈ ఔషధాన్ని ఉపయోగించేవారట. ఈ చెట్లు ఉన్న ప్రాంతాన్ని యునెస్కో 2008వ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రపంచంలోనే అత్యంత వైవిద్యం కలిగిన విభిన్న ప్రాంతంగా గుర్తించింది. ఈ చెట్ల కారణంగానే ఈ ద్వీప సమూహంలో నీటి కొరత లేదు అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ దీవిలో సుమారు 50 వేల మంది నివసిస్తున్నారు. ఈ చెట్లు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నీటి సమస్య లేదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వందల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉంటూ ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నటువంటి చెట్లు ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉన్నాయి. తీవ్ర తుఫానుల కారణంగా సాకోత్ర ద్వీపంలో ఉన్న డ్రాగన్ బ్లడ్ ట్రీ నాశనమవుతున్నాయి. వీటి నుంచి వచ్చిన చిన్న చిన్న మొక్కలను మేకలు ఇతర జంతువులు తినేస్తున్నాయి కాబట్టి ఆ విత్తనాలు కూడా మళ్లీ తిరిగి మొలకెత్తడం లేదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవ వైవిధ్యానికి ప్రతీకలైన ఈ చెట్లు అంతరించిపోయే పరిస్థితి రావడం త్వరలో రానున్న సంక్షోభానికి హెచ్చరిక అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ చెట్లను పునరుత్పత్తి చేయడానికి దాదాపు అర్థ శతాబ్దం పైనే పడుతుంది. ఈ సమయంలో ఈ చెట్లను రక్షించే లేకపోతే ఈ జాతి మొత్తం అంతరించిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. వీటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంది కనుక వీటిని కాపాడడానికి శాస్త్రవేత్తలు బాగానే ప్రయత్నిస్తున్నారు ఈ చెట్లు ఈ ద్వీప సమూహంలో మాత్రమే ఉన్నాయి. ఇలా అక్కడక్కడ అరుదుగా కనిపించే మొక్కలు అని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉండాలి. ఈ భూమిపై జంతువుల రక్తం వచ్చే చెట్టు ఇది ఒక్కటి మాత్రమే. అది రక్తం కాదు కాని రక్తంలో బయటికి వస్తుంది. బెరడు ని గాని కాండాన్ని కాని ఘాటు పెట్టినప్పుడు దాని నుంచి రక్తం బయటికి రావడం మనం చూడవచ్చు. దీనిని ఔషధాలలో రంగులలో అక్కడక్కడ వాడుతూనే ఉంటారు. యునెస్కో 2008లోనే జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తించింది కాబట్టి భవిష్యత్తు కాలంలో వీటి మనుగడ కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ చెట్లు ఆరువందల యాభై సంవత్సరాల వరకు జీవించగలరు అంటే అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత పురాతనమైన చెట్లు అనే విషయం. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలో వారు దీనితో వర్తక వ్యాపారం కూడా చేసే వారట. ఇదో అద్భుతమైన వింతైన చెట్టు.

Previous articleఈ ఒక్క చిట్కా ఆపరేషన్ లేకుండా గుండె నొప్పిని దూరం చేస్తుంది
Next articleపరశురాముడు క్షత్రియ జాతిని చంపడానికి గల కారణం?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here