Nadhiya : అప్పట్లో పవన్ కళ్యాణ్ అత్త ఆ హీరోని పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం… కానీ చివరికి…

467

Nadhiya : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తమిళ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “నదియా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా నటి నదియా గతంలో పలు చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ పెళ్లయిన తర్వాత కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడి కొంతకాలం పాటూ సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి నటనకి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో తన భర్తతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది. అయితే పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ ఆ మధ్య తెలుగులో ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన “అత్తారింటికి దారేది” అనే చిత్రం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది. కాగా అత్తారింటికి దారేది చిత్రంలో హీరో అత్త పాత్రలో నటించి తన సెంటిమెంటల్ ఓరియంటెడ్ నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. దీంతో నటి నదియా సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి ఆరంభం లభించిందని చెప్పవచ్చు.

అయితే తాజాగా నటి నదియా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నటి నదియా అప్పట్లో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖ హీరో సురేష్ ని ప్రేమించిందని కానీ వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు అభ్యంతరాలు తెలపడంతో ఈ ప్రేమాయణం పెళ్లి పీటలెక్కలేదని కొందరు చర్చించుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే గతంలో కూడా ఇలాంటి వార్తలే వినిపించడంతో నటుడు సురేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇందులో భాగంగా నదియా తో తాను ప్రేమలో పడినట్లు వినిపిస్తున్న వార్తలలో నిజం లేదని కొట్టిపారేశాడు. అలాగే తాము ఇద్దరూ కూడా మంచి స్నేహితులని, కాగా తామిద్దరూ కలిసి గతంలో ఓ చిత్రంలో నటించామని దాంతో అందరూ మా మధ్య ఏదో ఉందంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడు. దీంతో నటి నదియా ప్రేమ వ్యవహారం పై వినిపించిన పుకార్లకు బ్రేక్ పడింది.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు సురేష్ తెలుగు తమిళం, కన్నడ, తదితర భాషలలో దాదాపుగా 80 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించాడు. కానీ ఆ మధ్య తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సంఘటనల కారణంగా సినిమా ఇండస్ట్రీ పై పెద్దగా దృష్టి సాధించలేకపోయాడు. దీంతో గతంలో సురేష్ హీరోగా నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఆ తరువాత కొంత కాలం పాటు నటుడు సురేష్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి అడపాదడపా అవకాశాలతో బాగానే రాణిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటున్నాడు.

రన్నర్ గా షణ్ముఖ్ మీద శ్రీరామ్ బెటరా ?

Previous articleMarriage : పెళ్లి మండపం లోనే కానిచ్చేసిన నూతన జంట… శోభనం వరకూ ఆగలేరా అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు….
Next articleRamesh Babu Family : రమేష్ బాబు భార్య – కొడుకుని చూసారా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here