ఆ హీరో దెబ్బకి ఈ హీరోయిన్ రాత్రికి రాత్రే ముంబై కి….
Sakshi Shivanand : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు బికిని దుస్తులు ధరించి అందాల ఆరబోతతో కుర్రకారును మతిపోగొట్టిన తెలుగు ప్రముఖ హీరోయిన్ సాక్షి శివానంద్ గురించి సినీ ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా నటి సాక్షి శివానంద్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి 1997వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. కానీ మాస్టర్ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోగా పోయినప్పటికీ సాక్షి శివానంద్ కి మాత్రం సినిమా ఆఫర్లు బాగానే వరించాయి. దీనికితోడు ఈ అమ్మడు అప్పట్లోనే ఏకంగా బికినీ దుస్తులు ధరించి ఘాటుగా అందాలు ఆరబోయడంతో కొంత కాలం పాటు తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలకి ఎలాంటి కొదువ లేకుండా గడిపింది. ఈ క్రమంలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, కింగ్ నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది. దీంతో తన చెల్లెలు శిల్పా శివానంద్ ని కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయాలనుకుంది.
ఈ క్రమంలో 2002వ సంవత్సరంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన బెజవాడ పోలీస్ స్టేషన్ అనే చిత్రం ద్వారా తన చెల్లెలిని హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. దీంతో హీరోయిన్ శిల్పా శివానంద్ కూడా సినిమా ఆఫర్లు బాగానే దక్కించుకుంటూ రాణించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఏమైందో ఏమోగాని ఉన్నట్లుండి నటి సాక్షి శివానంద్ తన సోదరితో కలిసి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ని వదిలిపెట్టి రాత్రికి రాత్రే మూటాముల్లె సర్దుకుని ముంబైకి వెళ్లి పోయిందని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు. అప్పటి మీడియా కథనాల ప్రకారం 2003 వ సంవత్సరంలో నటి శిల్పా శివానంద్ కి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో కొడుకుతో నటించే అవకాశం వచ్చింది. కాగా ఈ చిత్రం హీరో కొడుకుకి మొదటి చిత్రం. దీంతో ఆ ప్రముఖ హీరో దగ్గరుండి షూటింగ్ పనులు కూడా చూసుకుంటున్నాడు. అయితే అనుకోకుండా షూటింగ్ మధ్యలో నటి శిల్పా శివానంద్ చెప్పకుండా రెండు రోజులపాటు షూటింగ్ కి హాజరు కాలేదు.
Sakshi Shivanand కలగజేసుకుని ఆ హీరో పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ప్రముఖ హీరో కచ్చితంగా సినిమా షూటింగ్ కి రావాల్సిందేనని పట్టుబట్టడంతో పాటు అసభ్యకర పదజాలంతో దూషించాడట. దాంతో సాక్షి శివానంద్ కలగజేసుకుని ఆ హీరో పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో ఆ ప్రముఖ హీరో ఏకంగా తన పలుకుబడిని ఉపయోగించి లోకల్ పొలిటిషియన్స్ తో సీరియస్ వార్నింగ్ ఇప్పించడంతో భయపడిన సాక్షి శివానంద్ మరియు శిల్పా శివానంద్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి దూరంగా వెళ్లిపోయారని టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు నటి సాక్షి శివానంద్ మరియు శిల్ప ఎందుకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్లిపోయారనే విషయంపై మాత్రం సరైన స్పష్టత లేదు. అలాగే నటి సాక్షి శివానంద్ ని బెదిరింపులకు గురి చేసిన ఆ స్టార్ హీరో ఎవరనే విషయం కూడా బయటికి రాలేదు.
అయితే నటి సాక్షి శివానంద్ తెలుగులో దాదాపుగా 6 చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఇందులో రాజశేఖర్ హీరోగా నటించిన సింహరాశి చిత్రం లో సాక్షి శివానంద్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులని బాగానే ఆ లభించడంతోపాటు మంచి ఇమేజ్ తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కూడా కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడటంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఇక శిల్పా శివానంద్ తన రెండో చిత్రం లో నటిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్ళిపోయింది. దాంతో అప్పటి నుంచి ఈ అమ్మడు మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం అడపాదడపా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కానీ హీరోయిన్ గా మాత్రం పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బుల్లితెరపై కూడా దాదాపుగా 4, 5 ధారావాహికలలో కనిపించింది.
Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )
https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/
https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/
If you like our article about Sakshi Shivanand
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites