ఒక్క వారం లో ఎంతటి బరువు అయినా తగ్గించే చిట్కా
weight loss – ఈ రోజుల్లో చాలా మందిని ఎక్కువగా బాధిస్తున్న సమస్య అధిక బరువు. బాడీలో అధికంగా కొవ్వు పేరుకుపోయి పొట్ట, నడుము, తొడలు ఇలా శరీరంలో ప్రతి భాగంలోనూ పేరుకుపోతుంది. అలాగే మారుతున్న జీవన శైలి లో బరువు పెరగడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అలాగని గంటల తరబడి వాకింగ్ చేసే తీరిక కూడా చాలామందికి లేదు. అలాగని తిండి మానుకొని కడుపు మాడ్చుకోవడం కూడా వీలు కాదు అది ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు. మరి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గడం ఎలా? మన ఇంట్లోనే ఈ కొవ్వుని కరిగించే డ్రింక్ ని తయారు చేసుకొని తాగడం వలన కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. కావున ఇప్పుడు మనం మన ఇంట్లో దొరికే వస్తువులతో మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించి ఒక అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలలో ముందుగా కావలసిన పదార్థం ఒక చిన్న అల్లం ముక్క. ఈ అల్లంలో ఎన్నో రకాలైన ఔషధగుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ వంటి ధర్మాలతో పాటు ఎన్నో రకాల విటమిన్స్ ,మినరల్స్ ఇతర పోషకాలు అల్లంలో ఉన్నాయి. అంతేకాకుండా అల్లంలో బరువు ని తగ్గించే కొవ్వుని కలిగించే గుణాలు ఉన్నాయి అని చాలా మందికి తెలియదు.పోట్టా, నడుము, తొడలు వంటి భాగంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం అల్లంలో పుష్కలంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అల్లాన్ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నీటిని తీసుకొని ఒక బౌల్లో వేసి స్టౌ పైన పెట్టి వేడి చేయాలి నీరు మరుగుతున్నప్పుడు కట్ చేసుకున్న అల్లం ముక్కలను దానిలో వేయాలి ఇలా ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనిచ్చి ఆపైన ఈ నీటిని వేరే బౌల్ లోకి వడకట్టుకోవాలి. తర్వాత కావలసిన పదార్థం నిమ్మకాయ. నిమ్మకాయలో సి-విటమిన్ తో పాటు సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ జీర్ణక్రియ వ్యవస్థ ను వేగవంతం చేసి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు బయటికి పంపించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తొలగించడంతో పాటు మలబద్దక సమస్యలను కూడా నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో నిమ్మకాయ కీలకపాత్ర పోషిస్తుంది. నిమ్మకాయని సగానికి కట్ చేసి ఒక అర చెక్క నిమ్మరసంని ఆ నీటిలో పిండుకోవాలి. తర్వాత కావలసిన పదార్థం తేనే. తేన మన ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికి శరీరానికి అత్యంత శక్తిని ఇచ్చే ఆహార పదార్ధం ఔషధం కూడా. శరీరంలో తక్షణమే శక్తి అందించడంతో పాటు రక్తశుద్ధికి కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. అలాగే బరువుని తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఒక స్పూన్ తేనని ఈ నీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన బరువుని తగ్గించే డ్రింక్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు ఈ డ్రింక్ ని ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకుందాం. దీనిని రెండు వారాల పాటు ఉదయాన్నే పరగడుపున ఏమీ తినకముందే తాగాలి. అలాగే మీరు జిమ్ కి వెళ్తున్నా ఏదైనా శారీరక వ్యాయామం చేస్తున్నా కూడా జిమ్ కి వెళ్లడానికి ముందు దీనిని తాగవచ్చు. ఇది తాగిన ఒక గంట తర్వాత ఏదైనా బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. అయితే ఈ డ్రింక్ ని తాగేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనితో పాటు రోజంతా ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు కచ్చితంగా నీటిని తాగాలి. భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీటిని ఖచ్చితంగా తాగాలి. అలాగే భోజనం చేసిన తరువాత కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా అటూ ఇటూ తిరగాలి .దీనివల్ల మీరు తీసుకున్న ఆహార పదార్ధం బాగా జీర్ణం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన, బాగా పని చేయగలిగిన హోమ్ రెమిడి. దీనిని ఆడవారి అయినా సరే మగవారి అయినా సరే అందరూ ఉపయోగించవచ్చు. అయితే గర్భవతిగా ఉన్న స్త్రీలు మాత్రం డాక్టర్ను సంప్రదించకుండా ఈ డ్రింక్ ని వాడకూడదు. ఇది వాడడం ప్రారంభించిన ఒక వారం రోజులలోనె శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడాన్ని మనం గమనించగలము. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బరువును తగ్గించడం మాత్రమే కాకుండా పెరుగుతున్నటువంటి బరువును కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల శరీరంలో మెటబాలిజం అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. దీనివలన శరీరంలో ఎక్కువ కొవ్వు అనేది తయారవడం ఆగిపోతుంది. ఈ మిశ్రమాన్ని రెండు వారాల కంటే కూడా ఎక్కువగా ఉపయోగించాలి అనుకుంటే మాత్రం రెండు వారాల తర్వాత మధ్యలో కచ్చితంగా ఒక వారం రోజులపాటు గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. నిమ్మకాయ తేనె అధికంగా వాడటం వల్ల మన శరీరంలో అప్పుడప్పుడు క్యాల్షియం శాతం తగ్గిపోవడం జరుగుతుంది. రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే పొట్ట పై భాగంలో ఉన్న కొవ్వును కరగడం మీరే గమనించగలరు.
If you like our article about weight loss
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites