నిద్రలో వచ్చే కల
నిద్రలో : మన పురాణాలలో మనకు వచ్చే కల భవిష్యత్తుని తెలియజేస్తుంది అని చెప్పడం జరిగింది. స్కంద పురాణం లోని స్వప్న శాస్త్రంలో కలల ఫలితాలు కలల కారణాల గురించి వివరణ ఉంది. ఒక ఆత్మ కలలో ఉన్నప్పుడు శరీరం తో పూర్తిగా సంబంధం తెగిపోయి స్వేచ్ఛా లోకంలో విహరిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ దైవాన్ని స్మరించుకుంటూ పడుకున్న వారు కలలో దైవాన్ని దర్శించుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని పొందుతారు. కల అనేది ఆ దైవాన్ని చేరుకునే ఒక మార్గం. ప్రతి మనిషికి కూడా కలలు రావడం అనేది జరుగుతుంది. కొన్ని కలలు మనకి ముందుగా జరిగే భవిష్యత్తుని తెలియజేయడం జరుగుతుంది. ఎటువంటి కలలు వస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.
నిద్రలో కలల గురించి అధ్యయనం
కలల గురించి అధ్యయనం చేసే ఒక శాస్త్రం ఉంది దాని పేరు “ఉన్మరాలజీ” కలలకు ఎక్కువ సమయం ఉండదు. కొన్ని కలలు అయితే సెకండ్ల వ్యవధిలో మరి కొన్ని కలలు నిమిషాల వ్యవధిలో ఉంటాయి. ఎక్కువసేపు వచ్చే కలలు గుర్తు ఉండవు. సగటు వ్యక్తి ఒక రాత్రి మూడు కలల నుంచి ఐదు వరకు కలలుకంటారు. కళ్ళు లేని వారు కూడా కలలుకంటారు అని అంటూ ఉంటారు. అయితే ఆ కలలో దృశ్యాలు ఉండవు శబ్దాలు మాత్రమే ఉంటాయి. మనిషి స్వప్న స్థితిలో ఉన్నప్పుడు కనుగుడ్లు వేగంగా కదులుతాయి. కలలు గుర్తుపెట్టుకుని తిరిగి చెప్పే శక్తి మగవారికంటే కూడా ఆడవారికి ఎక్కువగా ఉంటుందట. ఎటువంటి కలలు వస్తే మంచిది జరుగుతుందో తెలుసుకుందాం. గాలిలో ఎగురుతున్నట్టు కల వస్తే మనకి మంచి అనుభూతి కలుగుతుంది కానీ ఇలాంటి కల గనుక వస్తే ఒక మరణ వార్త వినవలసి వస్తుంది. పాములు తేళ్లు ఉన్నచోటికి వెళ్తున్నట్టు గా కల వస్తే కోరి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. పాములు తేళ్లు చంపినట్లుగా కల వస్తే త్వరలోనే శత్రువులు నశిస్తారు అని అర్థం చేసుకోవాలి.
సూర్యోదయం అవుతున్నట్లుగా కల వస్తే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి శుభం కలుగుతుంది. సూర్యాస్తమయం కనిపించినట్లయితే కీడు అపనిందలు వ్యాపార నష్టం కలుగుతుంది. సూర్యకిరణాలు పక్క మీద పడుతున్నట్లు కల వస్తే అనారోగ్యం. మీ గది మొత్తం సూర్య కాంతితో ప్రకాశింస్తూన్నట్టుగా కల వస్తే ధన లాభం సంతాన లాభం కలుగుతుంది. మీ పెళ్లికి సంబంధించిన కల వస్తే మాత్రం ఆ శుభసూచకం. ఇతరులకు వివాహం జరుగుతున్నట్లుగా కల వస్తే శుభసూచకమని చెప్పారు. కలలో చేపల ని చూస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. మాంసం తింటున్నట్టు గా కలగంటే దెబ్బలు తగులుతాయి. మీరు కలలో దెబ్బలు తింటున్న నట్టుగా కల కంటే పరీక్షలలో ఉత్తీర్ణులు అయినట్లుగా సూచన. కాళ్ళు చేతులు కడుగుతున్నట్లుగా కలకంటి మీకున్న అన్ని రకాల కష్టాలు దుఃఖాలు తొలగి పోయినట్లే, మీరు కలలో పెళ్లికూతురిని ముద్దాడుతున్న ట్లుగా కల వస్తే శత్రువులతో సంధి కుదుర్చుకుంటారు. పాములను పట్టు కుంటున్నట్లుగా కల కంటే మీరు భవిష్యత్తులో విషయాలను చేజిక్కించుకుంటారు అని అర్థం. పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న ట్లుగా కల వస్తే గౌరవ ప్రతిష్ఠలు లభిస్తాయి అని అర్థం.
మీ కలలో మీ మెడ నిటారుగా కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. మీరు పాలు తాగుతున్నట్లు కలగంటే గౌరవమర్యాదలు లభిస్తాయి అంటున్నారు. నీరు తాగుతున్నట్లు గా kalaganti భాగ్యోదయం కలుగుతుంది. పందెంలో పరిగెత్తుతూ ఉన్నట్లుగా కలగంటే సంతోష వార్త వినడానికి సూచన. ఎవరో తరుముతున్నట్లు గా కల వస్తే ఆపద రాబోతుంది అని నమ్మకం. కలలో గోధుమలు కనిపిస్తే లాభం కలుగుతుంది. సమాధి మీద ఉన్న అక్షరాలు చూసినట్టుగా చదివినట్లుగా కల వస్తే శుభం కలుగుతుంది. గోళ్లు పొడవుగా పెరిగినట్లు కలవస్తే ధనలాభం. పుస్తకాలు చదువుతున్నట్లుగా కల వస్తే వర్తక వ్యాపారాలలో అభివృద్ధి విజయం లభిస్తుంది. ఇక చనిపోయినట్లుగా కల వస్తే మాత్రం శుభకార్యం జరుగుతుంది. ఇలా కలల ద్వారా మన భవిష్యత్తు తెలుసుకోవచ్చు.