శివలింగం ఇంటిలో ఉండొచ్చా ?

195

శివుడు ఎవరు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ మహా వ్యక్తి చుట్టూ ఎన్నో పురాణాలు కథలు గాథలు ఉన్నాయి. ఆయన దేవుడా లేక భారతీయ ఆధ్యాత్మిక వేత్తలు చేసిన సంయుక్త కల్పన లేక ఇంకా లోతుగా పరిశీలిస్తే శివ అనేదానికి అర్థం ఏదైనా ఉందా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి. సైంటిస్టుల కథనం ఎలా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శివుడు నిరాకారుడు అని హిందూ ధర్మం చెబుతుంది. కానీ ఆ నిరాకారుడు భక్తుల పూజలను అందు కోవడానికి ఆలయాలలో శివలింగం రూపంలో కొలువై ఉన్నాడు. భక్తులు ఆయనను అత్యంత శక్తి వంతమైన దైవం గా కొలుస్తారు. నియమ నిష్టలు పాటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా శివలింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అనేక శక్తులను ఈ శివలింగం సూచిస్తుంది. అసలు శివలింగం అంటే ఏమిటి. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే దేవుళ్లలో శివుడు కూడా ఒకరు. ఈయనను పూజించడానికి చాలా మంది భక్తులు ఉంటారు. ముఖ్యంగా భక్తులు శివుడిని సోమవారం పూజిస్తారు. ఆ రోజున మాంసాహారం కూడా తినరు. ఉపవాస దీక్షలు కూడా చేస్తారు. అయితే మిగిలిన దేవుళ్లను దేవతలను వారి వారి విగ్రహాల రూపంలో పూజించడం జరుగుతుంది. కానీ శివుడిని మాత్రం భక్తులు ఎక్కువగా లింగ రూపంలో ని పూజిస్తారు. ఎక్కడ శివాలయాలకు వెళ్ళినా కూడా అక్కడ శివుడి విగ్రహం ఉండదు లింగం మాత్రమే ఉంటుంది. అంటే ఈ శివలింగం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.


అవి ఏమిటంటే శివలింగం కేవలం లింగం మాత్రమే కాదు. అది మూడు భాగాలుగా ఉంటుంది. కింది భాగం బ్రహ్మదేవుని గా మధ్యభాగం విష్ణువని పైభాగం శివ రూపంగానూ భావిస్తారు. ఇక లింగం కింద ఉండే భాగాన్ని యోని అని అంటారు. చాలా మందికి ఈ విషయం తెలియదు. లింగం యోనిల సంఘమైన శివలింగం విశ్వాసానికి ప్రతీక అని భావిస్తారు. సమస్త విశ్వము అందులో ఉంటుందట. జీవన విధానానికి అది సూచిక అని చెప్పారు. శివలింగం లో ఉండే లింగం యోని భాగాలు మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ను సూచిస్తాయి. లింగం అంటే పురాణాలలో నాశనం లేనిది అని స్థిరమైనది అని దృఢమైనది అని మన్నిక అయినది అని అర్థాలు చెప్పారు. ఇవన్నీ కలిసి ఉన్న భాగం లింగం అని అన్నారు. ఇది అనంతమైన శక్తిని జనింప చేస్తుంది అని విశ్వాసం. శక్తిని పొందాలి అంటే లింగాలని పూజించాలి అని చెప్పారు. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని పఠించి శివుని పూజిస్తే లింగారాధన చేసినట్లు అవుతుంది అని అర్థం. దీనితో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లోని శక్తి భక్తులలో చేరుతుంది అని నమ్ముతారు.
శివుని పుట్టుక గురించి పురాణాలలో ఇలా చెప్పడం జరుగుతుంది. ఒకరోజు బ్రహ్మ విష్ణు ఏది శక్తివంతమైనది అని వాదించుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా వారి మధ్య ఒక స్తంభం కనిపిస్తుంది. అయిదు దేవుళ్ళు ఆ స్తంభం మొదలు చివర తెలుసుకోవాలని బయలుదేరుతారు. తన గొప్పతనం చాటుకోవడం కోసం అని బ్రహ్మ ఆ స్తంభం యొక్క రూపురేఖలను పరిశీలిస్తూ ఉంటాడు. సమయం వృధా చేయడం ఎందుకు అనుకున్న విష్ణువు భూమిలోపలికి వెళ్తాడు. ఎంత వెళ్ళినా కూడా విష్ణువుకి ఆ స్తంభం యొక్క మొదటి భాగం కనిపించదు. బ్రహ్మదేవునికి కూడా ఆ స్తంభం యొక్క చివరి భాగం కనిపించదు. ఓడిపోయాం అన్న భావనతో విష్ణువు తిరిగి మళ్ళీ ఎక్కడ మొదలయ్యామో ఆ ప్రదేశానికి వచ్చేస్తాడు. అక్కడ పరమేశ్వరుడు కనిపిస్తాడు. వారి ఇద్దరి తో పాటు వారి పక్కన మరొక శక్తి ఉంది అని బ్రహ్మవిష్ణువులు గుర్తిస్తారు. ఆ స్తంభాన్ని లింగం గా భావిస్తారు. ఆ స్తంభం బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల ప్రతీకగా చెబుతారు. హిందూ దేవాలయాలు లో ఎక్కడ చూసినా శివలింగాలు ఉంటాయి ఆ లింగానికి ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి అని హిందువుల విశ్వాసం. సముద్రగర్భం నుంచి వచ్చిన లింగాలు ఎన్నో భారతదేశంలో కొలువై ఉన్నాయి. వీటిలో అత్యంత శక్తి ఉంటుంది అని భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు భావిస్తారు. అయితే శాస్త్రవేత్తలు ఈ లింగాల పై అనేక రకాల పరిశోధనలు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు. నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త లింగం పై పరిశోధనలు చేశారు. తన శాస్త్రీయ ఆవిష్కరణలను ఇలా చెప్తారు. ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు తో కూడిన అణువులతో ఈ లింగం తయారు చేయబడినది అని చెబుతారు. శివలింగం తయారీలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి అని అంటారు. ప్రాచీనకాలంలో ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ వంటి శాస్త్రీయ పదాలను ఉపయోగించడానికి బదులుగా విష్ణు లింగం బ్రహ్మ లింగం శక్తి వంటి పదాలను వాడారు. ఆ కాలంలో సంస్కృతం ప్రధాన భాష కావడం వల్లనే ఇలా పిలిచారు అని ఆయన అంటారు. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో శివలింగాన్ని అత్యంత శక్తి వంతమైన దైవం గా పూజిస్తారు ఆరాధిస్తారు. ఆధ్యాత్మిక దైవం గా కొలుస్తారు. ఓం నమశ్శివాయ. అని మంత్రాలు శివాలయాల్లో మారుమోగుతూనే ఉంటాయి.

Previous articleశరీరం లో లివర్ చేసే పని ఏంటో తెలుసా ?
Next articleOld Sculpture : అందరిని ఆశ్చర్యపరుస్తూ సైకిల్ మీద కనిపించిన శివుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here