Baba : ప్రస్తుత కాలంలో కొందరు ప్రతి చిన్న విషయానికి మూఢనమ్మకాలను నమ్ముతూ పూజలు పునస్కారాలు అంటూ దొంగ బాబాల దగ్గరకు వెళ్లి మోసపోతున్నారు. దీంతో కొంతమంది బాబాలు ఇలాంటి వ్యక్తుల నుంచి అందినంత డబ్బులు దోచుకోవడంతోపాటు మాన, ప్రాణాలను కూడా దోచుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే తాజాగా ఓ వివాహిత తన కూతురికి పెళ్లి వయసు వచ్చినప్పటికీ పెళ్లి కావడం లేదని దగ్గరలో ఉన్నటువంటి బాబా దగ్గరికి తీసుకెళ్లడంతో పూజల పేరుతో అత్యాచారానికి గురైన ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని నాసిక్ జిల్లా పరిసర ప్రాంతంలో మహతి (పేరు మార్చాం) అనే ఓ వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. అయితే మహతి భర్త కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎక్కువగా ఉద్యోగం నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళుతుండటంతో మహతి ఇంటి పట్టునే ఉంటూ కుటుంబ బాధ్యతలను చక్కబెట్టేది.
అయితే మహతి కూతురు పెళ్లి వయసుకి రావడంతో తనకి తగిన వరుడిని చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని అనుకుంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ మధ్య మహతి తన కూతురికి చూసిన సంబంధాలు పెద్దగా నచ్చలేదు. దీంతో తన కూతురికి పెళ్లి వయసు దాటిపోతున్నప్పటికీ పెళ్లి మాత్రం జరగడం లేదని మహతి తరచూ తనలో తానే బాధపడేది. ఈ క్రమంలో తన బంధువుల ద్వారా మహతి కూతురు జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నాయేమో కనుక్కోవడానికి దగ్గరలో ఉన్నటువంటి ఓ బాబా దగ్గరికి వెళ్ళింది.
అయితే మహతి కూతురు జాతకం చూసిన పురోహితుడు ఏకంగా యువతిని జాతకంలో పలు దోషాలు ఉన్నాయని దాంతో దోష నివారణ పూజలు చేయాలని మాయమాటలు చెప్పాడు. అలాగే ఈ దోష నివారణ పూజలు కేవలం తల్లికూతుర్ల సమక్షంలో మాత్రమే చేయాలని మగవాళ్ళు ఎవరూ కూడా పూజ గదిలోకి రాకూడదని కండిషన్ కూడా పెట్టాడు. దీంతో దొంగ బాబా మాయ మాటలను గుడ్డిగా నమ్మిన తల్లీకూతుళ్లు అతడి మాయమాటలలో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించలేక పోయారు.
దీంతో తాజాగా తల్లీకూతుళ్లు ఇద్దరు కలిసి బాబా ఉన్నటువంటి ఇంటికి వెళ్లారు. దాంతో కొంత సేపు బాబా పూజల పేరుతో కాలక్షేపం చేసి మత్తు మందు కలిపిన పదార్థాలను ప్రసాదంగా తల్లీకూతుళ్లకి ఇచ్చాడు. ఇది తెలియనటువంటి తల్లీకూతుళ్లు ఇద్దరూ ఈ ప్రసాదాన్ని తిని మత్తులోకి జారుకున్నారు. ఆ తర్వాత బాబా మరియు అతని సోదరుడు ఇద్దరు కలిసి తల్లీకూతుళ్ల పై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా నీచమైన ఘటనని వీడియో కూడా తీశారు.
మత్తు నుంచి తేరుకున్న తర్వాత అసలు విషయం తెలుసుకున్న తల్లీకూతుళ్లు బోరున విలపించారు. అలాగే తమపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన బాబా ని నిలదీశారు. కానీ అప్పటికి ఈ ఇద్దరి తల్లీకూతుళ్ల నగ్న వీడియోలు తీయడంతో పురోహితుడు ఏకంగా తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ నచ్చిన వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. దీంతో తమ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించిన మహతి బాబా అడిగిన డబ్బు ఇచ్చింది. కానీ ఈమధ్య బాబా ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవతుండడంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది.
దీంతో బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దొంగ బాబా ను అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. అయితే ఈ పోలీసుల విచారణలో ఈ దొంగ బాబా పూజల పేరుతో గతంలో కూడా పూజల పేరుతో కొందరు ఆడవాళ్ళని లోబర్చుకొని తన కామవాంఛను తీర్చుకోవడంతో పాటు బ్లాక్మెయిలింగ్ కి పాల్పడుతున్నట్లు కనుగొన్నారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.