Youngest Mother in the World

Youngest Mother in the World (young age mother) – అమ్మతనం అనేది దేవుడిచ్చే వరం. పెళ్లైన ప్రతి మహిళ మాతృత్వం కోసం తపిస్తుంది. మరో బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మ అని అంటారు. అసలు ఆడ జన్మకు తల్లి అయితేనే సార్దకత అని భారత దేశంలో నమ్ముతారు. అయితే ఎవరైనా తల్లి కావాలనుకుంటున్నారంటే తనకు పుట్టబోయే బిడ్డకు సపర్యలు చేసి, జాగ్రత్తగా పెంచి పెద్ద చేసే అవగాహన, ఓపిక ఉన్నప్పుడే తల్లి కావాలనుకుంటారు. మామూలుగా అయితే 18ఏళ్లు పై బడిన అమ్మాయి పెళ్లి చేసుకుని గర్భవతి అవుతుంది. ఇక బాల్య వివాహాల్లో అయితే 14 ఏళ్లు దాటిన వారు కూడా బాల్యం లోనే తల్లులైనట్లు అక్కడక్కడా వింటుంటాం. కానీ ఐదేళ్లకే తల్లైతే ( young age mother ). నమ్మడానికే విచిత్రంగా ఉంది కదా. కానీ ఇది నిజం. అసలు శరీరం కూడా సహకరించని వయసలో పెరూ కి చెందిన లీనా మెడీనా అనే ఐదేళ్ల పాప తనకు తెలియకుండానే తల్లిగా మారింది. ఈమె పెరూ దేశంలో సెప్టెంబర్ 27,1933లో ట్రికాపో అనే ఊల్లో పుట్టింది. ఆ గ్రామం కొండ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రాంతం. ఆమెతో పాటు తొమ్మిది మంది ఉన్నారు. తండ్రి టిబురెలో మెడీనా వెండి వస్తువులను తయారు చేసేవాడు. తల్లి విక్టోరియా లోసియా ఇంటి పనులు చూసేది.

ఇక లీనా మెడీనా ఐదేళ్ల వయసులో ఆడుకుంటుండగా….ఒక రోజు కడుపు నొప్పి అని చెబితే డాక్టర్లు చూసి ఏమీ లేదు అజీర్తి అని చెప్పి పంపించారు. కానీ కొద్ది కొద్దిగా పొట్ట సైజు పెరుగుతుంటే పాప బొద్దుగా అవుతుందని అనుకున్నారు. కానీ అబ్ నార్మల్ గా పెరుగుతుంటే డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్తే పరిజ్ఞానం లేని వాళ్లు ఏమీ అర్దం కాక ఏవేవో చెప్పారు. పక్కనున్న పట్టణంలోకి తీసుకెళ్లినా కూడా డాక్టర్లు మందులు రాసి తగ్గుతుందని చెప్పి పంపేవాళ్లు. కొంత మంది కడుపులో ట్యూమర్ పెరుగుతుందని ఆపరేషన్ చేసి తీయాలని చెప్పేవాళ్లు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా లాభం లేకుండా పోయింది. ఇలా కాదని చెప్పి పిస్కో అనే పట్టణంలోని పేరున్న హాస్పిటల్ కి తీసుకెళ్లగానే డాక్టర్లు తమ దగ్గరే ఉంచుకుని ఆబ్జర్వ్ చేశారు. యుటిరస్ దగ్గర్నుండి ప్రెగ్నెన్సీ టెస్ట్ లు అన్నీ చేసి ఏడు నెలల గర్భవతని డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. ఆ తర్వాత డాక్టర్లు తల్లిని ఆరా తీయగా పాపకు రెండున్నరేళ్ల నుండే పీరియెడ్స్ ఉన్నాయని తేలింది. కానీ దానిని తల్లి గుర్తించలేకపోయింది.
డాక్టర్ గిరార్డో లోజాడా అనే వైద్యుడు ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకున్నాడు. పాపను హాస్పిటల్ లోనే ఉంచుకుని ట్రీట్ మెంట్ చేస్తూ జాగ్రత్తగా అప్పుడున్న టెక్నాలజీని బట్టి లోపల పిండం ఆరోగ్యంగా ఉందని తేల్చారు. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ పాపకు రిప్రొడక్టివ్ పార్ట్స్ అన్ని వృద్ది చెంది ఉండటం డాక్టర్లను ఆశ్యర్యపరిచింది. డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ తర్వాత పాపకు ఎనిమిది నెలలనుండే మెన్స్ట్రూయేషన్ స్టార్ట్ అయి ఉంటుందని తేల్చారు.
డాక్టర్ల పర్యవేక్షణలో తొమ్మిదినెలల తర్వాత సీ సెక్షన్ ఆపరేషన్ తో మే14,1939న పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది లీనా మెడీనా ( a super young age mother ). అప్పట్లో ఇది మెడికల్ మిరాకిల్ గా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాప డీటెయిల్స్ చూసేందుకు ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా ఆమె హాస్పిటల్ కు క్యూ కట్టారు. ఇక పుట్టిన ఆ బాబుకు డాక్టర్ పేరునే గెరార్డో అని నామకరణం చేశారు. పదేళ్ల వరకు లీనా ను తన సిస్టర్ అనుకునేవాడు ఆ కుర్రాడు. కానీ పదేళ్ల తర్వాత కానీ ఆమె తన తల్లి అని తెలియలేదు. 40 ఏళ్లు బతికిన గెరార్డో అనారోగ్యంతో చనిపోయాడు. మరి ఆ బాబు తండ్రి ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగా నే ఉంది. పాప కొన్ని సార్లు చెప్పిన కొన్ని విషయాలను బట్టి తండ్రినే అనుమానించి పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పాప ఫాదర్ తన తప్పేమి లేదని ప్రతి సారి చెప్పాడు. ఇటు ఆమె కూడా ఎక్కడా చెప్పలేదు. ఆమె వృద్దాప్యంలోనూ ఎవరైనా రిపోర్ట ర్లు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే తిట్టి పంపించేది.
Watch video of Youngest Mother in the World
If you like our article
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites